
మీరు ఫోన్‌లో రెండు సిమ్‌లు వాడుతు ఒకదాన్ని మాత్రమే రీఛార్జ్ చేస్తున్నారా... అయితే ఈ వార్త మీ కోసమే. రీఛార్జ్ చేయకుండా సిమ్ కార్డు ఎన్ని రోజులు యాక్టివ్‌గా ఉంటుందో తెలుసా... దీని గురించి సాధారణంగా చాలా మందికి తేలీదు. ప్రస్తుతం మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) అనే మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ యాజమాన్యంలో బిఎస్ఎన్ఎల్ ఉంది. ఇక సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే దీనికి సంబంధించి TRAI కొన్ని రూల్స్ రూపొందించింది...
రిలయన్స్ జియో సిమ్ : రీఛార్జ్ చేయకుండా మీ జియో సిమ్ 90 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది, కానీ ఆ తర్వాత మీరు తప్పకుండ రీఛార్జ్ చేసుకోవాలి. చివరి రీఛార్జ్ ప్లాన్ బట్టి ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యం ఒక నెల, ఒక వారం లేదా కొన్ని రోజులు ఉంటుంది. కానీ మీరు 90 రోజుల తర్వాత కూడా రీఛార్జ్ చేయకపోతే మీ నంబర్ పర్మనెంటుగా డిస్‌కనెక్ట్ అవుతుంది. అలాగే ఆ నంబర్ మార్కెట్లోకి వస్తుంది.
అప్పుడు ఆ నంబర్ వేరే ఎవరైనా తీసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ సిమ్ : మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ వాడితే ఎలాంటి రీఛార్జ్ లేకుండా మీ సిమ్ 90 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ మీకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. కానీ మీరు ఈ 15 రోజుల్లో కూడా రీఛార్జ్ చేయకపోతే మీ నంబర్ మీ పేరు నుండి కట్ అవుతుంది. తర్వాత మీ నంబర్ కొత్త కస్టమర్ల కోసం మార్కెట్లో మళ్లీ రిలీజ్ చేస్తారు.
వోడాఫోన్ ఐడియా (Vi) సిమ్ : వోడాఫోన్ ఐడియా సిమ్ కార్డు వాడే వారైతే మీకు కూడా 90 రోజుల సమయం ఉంటుంది, ఈ 90 రోజులు మీ నంబర్ యాక్టివ్‌గా ఉంటుంది కానీ 90 రోజుల తరువాత మీరు రీఛార్జ్ చేయకపోతే మీ నంబర్ డియాక్టీవ్ చేస్తారు. నంబర్ డియాక్టీవ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త కస్టమర్ల కోసం రిలీజ్ చేస్తారు. అప్పుడు ఎవరైనా మీ నంబర్ కొనొచ్చు.