ఎంత దుర్మార్గం : రూ.300 అప్పు కట్టలేదని రోడ్డుపై బట్టలు విప్పుతారా..?

ఎంత దుర్మార్గం : రూ.300 అప్పు కట్టలేదని రోడ్డుపై బట్టలు విప్పుతారా..?

మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన  జరిగింది.  మైనర్ బాలుడు రూ. 300 అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో నగ్నంగా  దాడి చేశారు. బాధితుడు తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వస్థలమైన థానేలోని కాల్వా శివారులోని జామా మసీదు సమీపంలో మంగళవారం ( నవంబర్21)మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా..

తౌసిఫ్ ఖాన్‌బండే, సమీల్ ఖాన్‌బండే అనే వ్యక్తులు ఇద్దరు తన  17 ఏళ్ల కుమారుడిని బట్టలు విప్పి దాడిచేశారని ఓ మహిళ  ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన మంగళవారం ( నవంబర్ 21) న జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడు తల్లి   గతేడాది నిందితుల్లో ఒకరి నుంచి రూ. 300 లు అప్పు తీసుకొంది.  కొంతకాలం తరువాత డబ్బులు అడుగుతున్నా ఇవ్వడం లేదని  నిందితుడు అమానుషంగా వ్యవహరించాడు. 

 మైనర్ బాలుడి బ్లూ టూత్.. ఇయర్ ఫోన్లను తీసుకొని పరారయ్యాడని  పోలీసులు తెలిపారు. ఆ తరువాత  బాధితులు నిందితుడి ఇంటికి వెళ్లి అతని తల్లి దగ్గర నుంచి ఇయర్ ఫోన్స్ తెచ్చుకున్నారు.  ఈవిషయం తెలుసుకున్న నిందితుడు  సహనం కోల్పోయి అతని స్నేహితుడితో కలిసి బాధితుడి ఇంటికి వెళ్లి దారుణంగా వ్యవహరించారు. వారిద్దరూ 17 ఏళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టారు. అతని బట్టలు ఊడదీసి కొట్టారు.

బాధితుడితో కలిసి అతని తల్లి   తౌసిఫ్ ఖాన్‌బండే ,  సమిల్ ఖాన్‌బండే అనే నిందితులపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు IPC 327 , 323 (రెండూ స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) , 34 (సాధారణ ఉద్దేశ్యం) ,జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు తౌసిఫ్‌ను ఈ రోజు  (నవంబర్ 22) మధ్యాహ్నం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న నిందితుడి  కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ... అజ్ఞాతంలో ఉన్పారని  పోలీసులు  తెలిపారు.