
న్యూఢిల్లీ: ‘జైల్ కే జవాబ్ హమ్ ఓట్ సే దేంగే’ అనే ఆప్ లోక్‌సభ ప్రచార గీతాన్ని ఈసీ నిషేధించిందని ఆ పార్టీ వెల్లడించింది. ఆదివారం ఆప్ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక పార్టీ ప్రచార పాటపై ఈసీ నిషేధం విధించడం ఇదే మొదటిసారి. ఈ పాటలో అధికార పార్టీని, దర్యాప్తు సంస్థలను చెడుగా చూపుతున్నామని ఈసీ భావించింది. అయితే, పాటలో బీజేపీని ప్రస్తావించలే. మోడల్ కోడ్ ఉల్లంఘించలే. వాస్తవ వీడియోలు, సంఘటనలు మాత్రమే ఇందులో ఉన్నాయి” అని పేర్కొన్నారు. బీజేపీ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్య తీసుకోలేదని ఆమె ఆరోపించారు.