జంట జలాశయాలకు తగ్గిన వరద .. నాలుగు గేట్లు క్లోజ్

జంట జలాశయాలకు తగ్గిన వరద ..  నాలుగు గేట్లు క్లోజ్

హైదరాబాద్, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో జంట జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను అధికారులు క్లోజ్ చేశారు. శనివారం వరకు ఆరుగేట్ల ద్వారా నీటిని బయటకు పంపిన జలమండలి అధికారులు ఆదివారం ఉదయం రెండు గేట్లను మూసివేయగా, మధ్యాహ్నం మరో రెండు గేట్లను క్లోజ్ చేశారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా 1,240 క్యూసెక్కుల నీటిని మూసీకి పంపుతున్నారు. హిమాయత్ సాగర్  పూర్తిస్థాయి నీటిమట్టం1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,762 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడకు1,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం1,785.85 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడకు 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.