పుకార్లు వద్దు.. సమంత ఆరోగ్యంగానే ఉన్నారు

పుకార్లు వద్దు.. సమంత ఆరోగ్యంగానే ఉన్నారు

సినీ నటి సమంత అనారోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు ఆమె మేనేజర్. సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని..సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు. కొంచెం దగ్గు ఉండటంతో టెస్టు చేయించుకున్నారన్నారు. నిన్న కడపలో ఓ షాపింగ్ మాల్ ఒపెనింగ్ కు వెళ్లారు. అక్కడ దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేవారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన సమంత అనారోగ్యానికి గురయ్యారని..హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారని ప్రచారం జరిగింది. దీంతో సమంత మేనేజర్ స్పందించారు. సమంత ఆరోగ్యంగానే ఉందని ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.