KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్‌కతా

KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్‌కతా

ఐపీఎల్ లో మరో భారీ స్కోర్ నమోదయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ విరుచుకుపడింది. సొంతగడ్డపై గర్జిస్తూ పంజాబ్ బౌలర్లను ఉతికారేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తాము తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పో పవర్ ప్లే లోనే పంజాబ్ కు తెలిసి వచ్చింది. ఈ సీజన్ లో టాప్ ఫామ్ లో ఉన్న కేకేఆర్ ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏ బౌలర్ ను వదలకుండా ఉతికారేశారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 62 బంతుల్లోనే 138 పరుగులు జోడించి అదిరిపోయే శుభారంభం ఇచ్చారు.

నరైన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేస్తే.. సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు చేశాడు. వీరి ధాటికి పవర్ ప్లే లో ఏకంగా 76 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే తర్వాత ఈ జోడీ మరింత విధ్వంసం సృష్టించింది. తర్వాత నాలుగు ఓవర్లలో ఏకంగా 62 పరుగులు రాబట్టింది.

ఓపెనర్లు ఔటైనా.. రస్సెల్ (12 బంతుల్లో 24), వెంకటేష్ అయ్యర్(23 బంతుల్లో 39), శ్రేయాస్ అయ్యర్ ( 10 బంతుల్లోనే 28) చివర్లో బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ స్కోర్ 250 పరుగుల మార్క్ దాటింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోగా.. సామ్ కరణ్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ బ్యాటర్ల ధాటికి రబడా 3 ఓవర్లలోనే 52 పరుగులు.. సామ్ కరణ్ నాలుగు ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నారు.