స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు

 స్టాక్ మార్కెట్లో మోసపోతే ..   డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన విద్యార్థిని డబ్బులను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. బాధిత విద్యార్థిని కేసు పెట్టడంతో తనకు రావాల్సిన 10 లక్షల 23 వేల , 936 రూపాయలు చెక్కును సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు అందజేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నగరానికి చెందిన 21 ఏళ్ల యువతి కరోనా సెకండ్ వేవ్ లో  స్టాక్ మార్కెట్ పై ఉన్న అవగాహానతో  యూనిటీ స్టాక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. 

స్కామర్ల యువతి ఆధార్ , పాన్ డిటైల్స్ తీసుకొని ఒక అకౌంట్ ను క్రియేట్ చేశారు. ఆమె చేసిన ఇన్వెస్ట్మెంట్ కు లాభాలు వచ్చినట్లు చూపిస్తూ ఆమెకు మరింత నమ్మకం కలిగించారు. ఆరు నెలల తరువాత తాను ఇన్వెస్ట్మెంట్  చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే స్కామర్లు స్టాక్ మార్కెట్ లో కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు క్షిణించాయని , రిటర్న్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. 

అంతేకాకుండా  ఇన్వెస్ట్ చేయడం నిలిపివేస్తే , ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రిఫండ్ అవ్వవని బెదిరించారు. దీనితో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి , స్కామర్ల నుండి యువతికి రావాల్సిన డబ్బును రికవరీ చేసి  ఆమెకు అందజేశారు.