Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..

Whirlpool  lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..

టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగుల్లో లేఆఫ్స్ టెన్షన్ పట్టుకుంది. కార్పొరేట్ దిగ్గజాల నుంచి చిన్న చిన్న స్టార్టప్ల వరకు తమ కంపెనీల వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయి. అంతర్జాతీయం ఆర్థిక వ్యవస్థలో అనిశ్చింతి, కంపెనీల నిర్వహణ ఖర్చు, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త టెక్నాలజీ వినియోగం వంటి కంపెనీ ఇంటర్నల్ మార్పులతో కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 

2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు  దాదాపు లక్షల మంది టెకీలు లేఆఫ్ నోటీసులు అందుకున్నారు. తాజాగా గ్లోబల్ కిచెన్న, హోం అప్లియన్స్  కంపెనీ వర్ల్పూల్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ వర్క్ ఫోర్స్ లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

వర్ల్పూల్ వార్షిక ఫైలింగ్  ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా 59 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల కోత మేలో ఉండే అవకాశం ఉంది.  కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గించే లక్ష్యంతో లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. 2024లో 400 బిలియన్ డాలర్ల ఖర్చులను తగ్గించుకోవాలని వర్ల్పూల్ లక్ష్యంగా పెట్టుకుంది.