మైత్రీవనం దగ్గర ఫైర్ యాక్సిడెంట్.. పరిస్థితి ఏంటి..? అమీర్పేట్ వైపు వెళ్లొచ్చా..? ట్రాఫిక్ ఎలా ఉంది..?

మైత్రీవనం దగ్గర ఫైర్ యాక్సిడెంట్.. పరిస్థితి ఏంటి..? అమీర్పేట్ వైపు వెళ్లొచ్చా..? ట్రాఫిక్ ఎలా ఉంది..?

హైదరాబాద్: అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 14 షాప్లు దగ్ధమయ్యాయి. పూర్తిగా మంటలు అదుపులోకి రావడంతో మైత్రీవనం ఏరియాలో స్లో గా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

అత్యవసర సహాయక చర్యల కారణంగా.. అమీర్‌పేట నుంచి SR నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఘటన జరిగిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు. మైత్రివానం ఫైర్ ఆక్సిడెంట్ కారణంగా మెట్రో రైలు సేవలకు స్వల్ప అంతరాయం కలిగింది. మెట్రో సేవలను ఆపకపోయినప్పటికీ ఈ ఘటన జరిగిన సమయంలో మెట్రో పిల్లర్ల వరకూ దట్టంగా పొగలు వ్యాపించడంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి.

కొంతసేపటికి.. మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. మియాపూర్ టూ ఎల్బీనగర్, నాగోల్ టూ రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్స్ యధావిధిగా నడుస్తున్నాయి. అమీర్ పేట్లో ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు.