అవసరమైతే మళ్లీ అడ్డుకుంటా: స్టిమాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అవసరమైతే మళ్లీ అడ్డుకుంటా: స్టిమాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బెంగళూరు: సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రో–ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవడాన్ని ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇగోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిమాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్థించుకున్నాడు. ‘అన్యాయమైన నిర్ణయాల’ నుంచి తమ ప్లేయర్లను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి అలా చేస్తానని స్పష్టం చేశాడు. ‘ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అంశం. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఎంతవరకైనా తెగించాలి. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా చర్యలను మీరు ద్వేషించొచ్చు లేదా ప్రేమించొచ్చు. కానీ నేను యోధుడిని. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గను. అన్యాయమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మా ప్లేయర్లను రక్షించుకోవడానికి కచ్చితంగా పోరాడతా. అవసరమైతే మరోసారి అలాంటి చర్యలకు దిగుతా’ అని స్టిమాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసే సమయంలో ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టిమాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డుకున్నాడు. అతని నుంచి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని చూడగా పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లంతా తీవ్రంగా స్పందించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.