60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసింది ఏం లేదు

60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసింది ఏం లేదు

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసింది ఏం లేదన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మునుగోడు నియోజిక వర్గానికి ఫ్లోరోసిస్ ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ తొలి ఉద్యమ కారుడు శ్రీకాంతా చారి అయితే.. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని అన్నారు. తెలంగాణా ఉద్యమం టైం లో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమ కారులపై దాడులు చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులకు శ్రీకాంతా చారికి నివాళులు అర్పించే అర్హత లేదన్నారు.

కేసీఆర్ లేకుంటే రాష్ట్రంలో  టీపీసీసీ.. టీబీజేపీ ఎక్కడ ఉండేదన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ చేసింది ప్రజసంగ్రామ యాత్ర కాదని.. తిన్నది అరగక చేసిన అజీర్తి యాత్ర అని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు తాగి పచ్చని పంట పొలాల్లో యాత్ర చేసిన బీజేపీ  నాయకులకు రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. మునుగోడు ఎమ్మెల్యే మాటి మాటికి రాజీనామా చేస్తా అంటున్నాడు..అయిన రాజీనామా చేసినా,చేయకపోయినా రాష్ట్రం అంతట దళిత బంధు అమలు చేస్తామన్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రంలో  చిచ్చులు పెట్టాలని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్.