మహారాష్ట్రలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు

మహారాష్ట్రలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు

నాగ్ పుర్: మహారాష్ట్రలో గడిచిన పది నెలల్లో 2వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తేలింది. ఒక్క అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా  951 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఛత్రపతి శంభాజినగర్ డివిజన్ లో 877, నాగ్ పుర్ డివిజన్ లో 257, నాసిక్ డివిజన్ లో 254, పుణె డివిజన్ లో 27 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్  సభ్యుడు కునాల్  పాటిల్ అడిగిన ప్రశ్నకు  ప్రభుత్వం అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.  బాధిత కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు