‘వెలుగు’ కథనంపై స్పందించిన హెల్త్​మినిస్టర్

‘వెలుగు’ కథనంపై స్పందించిన హెల్త్​మినిస్టర్
  • ల్యాబ్ టెక్నీషియన్, వెహికల్ ఏర్పాటు
  • ‘వెలుగు’ కథనంపై స్పందించిన హెల్త్​మినిస్టర్

హైదరాబాద్, వెలుగు: సరోజినీదేవి కంటి ఆస్పత్రిని తక్షణమే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తో లింక్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ‘ఓపీ సరోజినీలో.. టెస్టులు గాంధీ, ఉస్మానియాలో!’ అనే శీర్షికతో బుధవారం వెలుగు పేపర్ లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఆస్పత్రికి ప్రత్యేకంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్, శాంపిల్స్ తరలించడానికి ఒక వెహికల్ ను ఏర్పాటు చేయాలని.. బుధవారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.

కాగా, హైదరాబాద్ లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ల్యాబ్ లేకపోవడంతో రోగులను రక్త పరీక్షల కోసం గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేస్తున్నారు. అంతదూరం వెళ్లడానికి పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వెలుగు పత్రికలో బుధవారం వార్తకథనం ప్రచురితం అయింది. మంత్రి దామోదర స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆస్పత్రిలో ఏండ్ల తరబడి కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. మంత్రి నిర్ణయం పట్ల పేషెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.