బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం : మంత్రి సీతక్క

బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం : మంత్రి సీతక్క
  • మంత్రి సీతక్క ఫైర్ 

ఇబ్రహీంపట్నం, వెలుగు: తాము అభివృద్ధి మీద పని చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల మీద పని చేస్తున్నాయని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. బీఆర్ఎస్, -బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, పట్టణ అభివృద్ధికి రూ.200 కోట్లు ఖర్చు చేశామన్నారు. 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, చిలుక మధు పాల్గొన్నారు.