ముంబైలో కల్తీ పాల దందా బయటపడింది. కాందివాలి ఈస్ట్‌లో అముల్, గోకుల్ వంటి ప్రముఖ బ్రాండెడ్ పాలలో నీళ్లు కలుపుతూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సమతా నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఇంటి పై దాడి చేసి, నిందితుడి దగ్గర ఉన్న 74 లీటర్ల కల్తీ పాలను, నకిలీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న నిందితుడిపై బీఎన్ఎస్, ఫుడ్ సేఫ్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
►ALSO READ | అవి వేర్ హౌస్ లా.. చెత్త కుప్పలా : ఆన్ లైన్ డెలివరీ గోదాముల్లో షాకింగ్ నిజాలు..!
మరోవైపు దేశవ్యాప్తంగానూ ఆహార కల్తీ కలకలం రేపుతోంది. 2025-26 సంవత్సరంలో సేకరించిన ఆహార సాంపుల్స్ లో 40 వేలకు పైగా సాంపుల్స్ నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసుల్లో వేల సంఖ్యలో సివిల్ జరిమానాలు, క్రిమినల్ శిక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
🔸Samta Nagar Police bust milk adulteration racket; accused arrested red-handed!
— मुंबई पोलीस Mumbai Police (@MumbaiPolice) August 13, 2026
The Detection Squad of @SamtaNagarPS raided a residence in Kandivali East and caught a 48-year-old man red-handed while adulterating branded milk with impure water for sale.
During the raid, 74… pic.twitter.com/0x9NRkDotr
