VVS Laxman: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి సంబంధించి బీసీసీఐ (BCCI) వర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగుస్తుండటంతో, తదుపరి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకానొక దశలో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, బీసీసీఐ మాత్రం హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ముందంజ!
ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్, రాబోయే రోజుల్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా లేదా టీమిండియా క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో కూడా లక్ష్మణ్‌కు మంచి సంబంధాలు ఉండటం, అతడి దార్శనికత భారత క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడుతుందని భారత క్రికెట్ బోర్డు పెద్దలు భావిస్తున్నారు.
రేసు నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్:
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్‌గా తప్పుకున్న రాహుల్ ద్రవిడ్, వెంటనే భారత జట్టుకు సంబంధించి మరో పూర్తి స్థాయి అధికారిక బాధ్యతను (సెలెక్టర్ లేదా డైరెక్టర్) చేపట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. కోచింగ్ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవాలని ద్రవిడ్ భావిస్తుండటంతో, గతంలో అండర్-19, భారత్– ఏ జట్లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విజయవంతంగా నడిపిస్తున్న లక్ష్మణ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తోంది.
బీసీసీఐ ఏజీఎంలో తేలనున్న భవిష్యత్తు:
రాబోయే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఈ అంశంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగిస్తారా లేదా అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను రంగంలోకి దించుతారా అనేది ఆ సమావేశంలోనే నిర్ణయించనున్నారు.
శ్రీలంకతో టెస్టు సమరం.. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యం:
మరోవైపు భారత జట్టు రేపటి (శనివారం, ఆగస్టు 15) నుంచి శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ అర్హత సాధించడంలో ఈ సిరీస్ ఇండియాకు చాలా కీలకం కానుంది. టూర్ ఆరంభంలో కొలంబోలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతుంది.
గాయాల పరంపర.. ఇరు జట్లకు ఒకే సమస్య:
ఈ సిరీస్‌లో భారత్‌ను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తుండగా, శ్రీలంకకు కూడా అదే సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు కుసాల్ మెండిస్, పతుమ్ నిస్సంక గాయాలతో తొలి టెస్టుకు దూరం కానున్నారు. 2008 నుంచి శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోని భారత్, గత రెండు లంక పర్యటనల్లోనూ సునాయాస విజయాలు సాధించింది. కానీ, సీనియర్ బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో ఈసారి టీమిండియా యంగ్ బౌలింగ్ విభాగానికి ఈ లంక టూర్ పెద్ద సవాలుగా మారనుంది.
🚨 ANNOUNCEMENT 🚨
— Indian Cricket (@IndianCricketHQ) August 14, 2026
🚨Breaking :- VVS Laxman as Director of cricket of BCCI
"He is not becoming the Chief Selector or a coach, instead the BCCI is set to appoint him as the Director of Cricket, a role in which he will oversee the cricket operations of the Indian cricket team."… pic.twitter.com/xfVFSuX5Ik
