ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో వచ్చేసింది.. 10 ఏళ్ల తర్వాత లోగో మార్పు.. కొత్త లుక్ చూశారా ?

ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో వచ్చేసింది.. 10 ఏళ్ల తర్వాత లోగో మార్పు.. కొత్త లుక్ చూశారా ?

దశాబ్ద కాలం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ దాని లోగో లుక్ లో చిన్న మార్పు చేసింది. గురువారం మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కొత్త వర్డ్‌మార్క్ (పేరు రాసే విధానం) లోగోను విడుదల చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సెరి దీన్ని సోషల్ మీడియా ద్వారా  ప్రకటించారు. పాత లోగోని పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేసిన.. ఇంతకు ముందుకంటే మరింత స్పష్టంగా,  మోడ్రన్‌గా మార్చామని ఆయన తెలిపారు. చివరగా 2016లో ఇన్‌స్టాగ్రామ్ దాని  లుక్‌ను మార్చుకున్న విషయం తెలిసిందే. పదేళ్లుగా యాప్‌లో ఉన్న పాత లోగో స్థానంలో ఇప్పుడు ఈ కొత్త డిజైన్ వచ్చింది.

అయితే ఈ కొత్త లోగోపై నెటిజన్ల నుంచి రకరకాల స్పందన వస్తోంది. కొంతమందికి కొత్త లోగో నచ్చిన.. మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అందులో వాడిన 'r' అక్షరం డిజైన్ చూస్తుంటే అది 'Instagzam' (ఇన్‌స్టాగ్జామ్) లాగా కనిపిస్తోందని నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తున్నారు.

'r' అక్షరం కోసం ఉపయోగించిన ఫాంట్ ఆకారం కారణంగా, ఆ లోగో ఇప్పుడు 'Instagzam' అని చదివినట్లుగా కనిపిస్తోందని చాలామంది సరదాగా అన్నారు.