‘రారా.. పెనిమిటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు

 ‘రారా.. పెనిమిటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుంది నందితా శ్వేత. తర్వాత గ్లామర్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కనిపించింది. ‘అక్షర’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకుంది. తాజాగా సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో నటించిన ‘రారా.. పెనిమిటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‌‌‌‌‌‌‌‌

కొత్త దర్శకుడు సత్యవెంకట్ రూపొందిస్తున్న చిత్రాన్ని  ప్రమీల నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నందిత మాట్లాడుతూ ‘సింగిల్ క్యారెక్టర్‌‌‌‌తో సినిమా చేయడం సాహసమే అయినా కథ నచ్చి ఓకే చెప్పాను. 

ఇందులో నటించడం నా అదృష్టం.  ఫ‌‌స్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీల‌‌య్యా’ అని చెప్పింది.   కొత్తగా పెళ్లైన అమ్మాయి.. తన భ‌‌ర్త రాక కోసం.. ప‌‌డే వేదన నేప‌‌థ్యంలో సింగిల్ క్యారెక్టర్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం అన్నాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, న‌‌టుడు రాంకీ, పాట‌‌ల ర‌‌చ‌‌యిత డా. డి.నీల‌‌కంఠ‌‌రావు, సింగ‌‌ర్ హ‌‌రిణి ఇవ‌‌టూరి తదితరులు పాల్గొన్నారు.