బిటెక్/ బీఈ అర్హతతో వరంగల్ NITలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

బిటెక్/ బీఈ అర్హతతో వరంగల్ NITలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 30. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్/ జియో– ఇన్ఫార్మేటిక్స్/ రిమోట్ సెన్సింగ్/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లేదా అనుబంధ విభాగాల్లో మొదటి తరగతిలో బి.టెక్/ బీఈ పూర్తి చేసి ఉండాలి.

జియో ఇన్ఫర్మేటిక్స్/ రిమోట్ సెన్సింగ్/ వాటర్ రీసోర్సెస్ ఇంజినీరింగ్​లో మొదటి తరగతిలో ఎం.టెక్/ ఎంఈ/ ఎంఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి . 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.