చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో  సమ్మయ్య అనే వ్యక్తి చనిపోయాడంటూ ఆందోళన చేపట్టారు అతని బంధువులు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారని ఆరోపిస్తున్నారు. 60 వేలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నడుచుకుంటూ హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తిని చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా సోలిపేటకి చెందిన సమ్మయ్యకు గుండెనొప్పి రావడంతో... నిన్న ఉదయం 10 గంటలకు కామినేని హాస్పిటల్ కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.  ఈసీజీ చేసిన డాక్టర్లు.. గుండె సమస్య ఉందని చెప్పి జాయిన్ చేసుకున్నారు. రాత్రి సమ్మయ్య చనిపోయాడని చెప్పారు హాస్పిటల్ సిబ్బంది. డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే సమ్మయ్య చనిపోయాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు.