V6 News

QR కోడ్ తో యాడ్స్ ఇవ్వకపోతే 50 వేల ఫైన్.. మహా రెరా సంచలన నిర్ణయం

QR కోడ్ తో యాడ్స్ ఇవ్వకపోతే 50 వేల ఫైన్.. మహా రెరా సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ - మహా రెరా కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రాపర్టీ డెవలపర్‌లను ప్రకటనలతో పాటు క్యూఆర్ కోడ్‌లను ప్రచురించాలని ఇప్పటికే ఆదేశించగా.. తాజాగా దీనిపై మరిన్ని మార్గదర్శకాలను వెలువరిచింది. ఆగస్ట్ 1 నుంచి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లందరూ మహారాష్ట్రలో ప్రచురించే లేదా విడుదల చేసే ప్రకటనలతో పాటు ప్రాజెక్ట్ పూర్తి వివరాలను కలిగి ఉండేలా క్యూఆర్ (QR) కోడ్‌ను ప్రచురించాలని ఆదేశించింది. అలా చేయకపోతే వారికి రూ. 50వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

ఆగస్టు నుంచి ఈ విషయంపై అథారిటీ పర్యవేక్షిస్తుందని, QR కోడ్‌ను ప్రచురించకపోతే డెవలపర్‌కు జరిమానా విధించబడుతుందని, ఆ తర్వాత వారికి 10 రోజుల సమయం ఇస్తామని, ఇంకా ఆ పద్దతిని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని మహా రెరా ప్రకటనను విడుదల చేసింది.

రియల్ ఎస్టేట్ డెవలపర్లు సాధారణంగా తమ ప్రాజెక్ట్‌లను వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లలో ప్రకటనల ద్వారా లేదా ట్విట్టర్శ్(Twitter), వాట్సాప్(WhatsApp), ఇన్ స్టాగ్రామ్(Instagram)లో భారీ సందేశాల ద్వారా ప్రచారం చేస్తారు. MahaRERA వెబ్‌సైట్ వివరాలతో పాటు అన్ని ప్రకటనలతో కేటాయించిన ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ప్రచురించడాన్ని గతంలోనే తప్పనిసరి చేసింది. ఇది ఇప్పుడు ఆగస్టు 1 నుంచి తప్పనిసరి చేసింది.

దీని వల్ల గృహ కొనుగోలుదారులు లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీలలో పెట్టుబడిదారులు కేవలం ఒక క్లిక్‌లో ప్రాజెక్ట్‌ల గురించి ప్రాథమిక సమాచారాన్ని పొందగలరని MahaRERA అభిప్రాయపడింది. అన్ని రెసిస్టర్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లకు కేటాయించబడిన QR కోడ్‌లో ప్రాజెక్ట్ పేరు, డెవలపర్ పేరు, ప్రాజెక్ట్ పూర్తయిన తేదీ, ప్రాజెక్ట్ కోసం డెవలపర్ పొందిన అనుమతులు, MahaRERAతో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ తేదీ మొదలైన సమాచారం ఉంటుంది. కొనుగోలుదారులు డెవలపర్ ఆమోదించిన వాటిలో ఏవైనా మార్పులు చేశారా, డెవలపర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునరుద్ధరించారా ,కొత్త అనుమతులను పొందారా అని కూడా దీని వల్ల చెక్ చేయవచ్చు.