ప్రకృతి కన్నెర్ర జేస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో వెనిజులాలో సంభవించిన ఘోర భూకంపం నిరూపించింది. ఎటు చూసినా కూలిపోయిన భవనాలు... కానీ, ఆ కాంక్రీట్ శిథిలాల కింద ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి, ప్రాణాలతో బయటపడిన ఒక చిన్న కుక్కపిల్ల కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆకట్టుకుంటుంది.
ఒక చిన్న అరుపు.. 5 గంటల పోరాటం..
లా గువైరా రాష్ట్రంలోని కారబల్లెడాలో 7.2, 7.5 తీవ్రతతో వరుసగా వచ్చిన రెండు భూకంపాల వల్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాల మధ్య ప్రాణాల కోసం అన్వేషిస్తున్న రెస్క్యూ టీమ్‌కు.. కాంక్రీట్ దిబ్బల లోపలి నుంచి చాలా చిన్నగా, దీనంగా వినపడిన ఒక చిన్న అరుపు వినిపించింది. అంతే, అక్కడ ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతోందని గ్రహించిన రక్షక సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయలేదు.
మళ్లీ లోపల ఏమైనా కూలిపోతుందేమో అన్న భయంతో.. మెషిన్స్ పక్కన పెట్టి, చేతులతోనే దాదాపు ఐదు గంటల పాటు భారీ బండరాళ్లను, ఇనుప రాడ్లను జాగ్రత్తగా తొలగించారు. ఆ ఇరుకైన సందులో ఐదు రోజులుగా ఆకలి దప్పికలతో అలమటిస్తున్న ఆ కుక్కపిల్లకు మొదట ఒక చిన్న రంధ్రం గుండా నీళ్ల సీసాను అందించి దాహం తీర్చారు.
నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో!
చివరికి గిసెల్ కుక్కపిల్లను సురక్షితంగా బయటకు తీశారు. ఐదు రోజులు చీకట్లో మృత్యువును చూసి భయపడిపోయిన ఆ మూగజీవి.. తనని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది చేతుల్లోకి రాగానే చేసిన పని అందరి హృదయాలను కదిలించింది. భయం పోయి, కృతజ్ఞతతో ఆ సిబ్బంది ముఖాన్ని నాకుతూ, తోక ఊపుతూ ప్రేమను కురిపించింది. "నన్ను కాపాడినందుకు థాంక్యూ" అని అది మాటల్లో చెప్పలేకపోయినా, అది చూపిన ప్రేమ అక్కడున్న వారందరి కళ్లల్లో ఆనందాన్ని తెప్పించింది. ఈ ఎమోషనల్ వీడియోను సాల్వడోరన్ ప్రెసిడెంట్ నయీబ్ బుకెలే సోషల్ మీడియాలో షేర్ చేయగా.., అది కాస్తా వైరల్‌గా మారి అందరి మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం గిసెల్ యజమానుల కోసం వెతుకుతున్నారు.
ALSO READ : 40 డిగ్రీల ఎండకే యూరప్లో రోడ్లు కరిగిపోతున్నాయి..
శిథిలాల మధ్యే.. కొత్త ప్రాణం
ఈ విపత్తు సృష్టించిన చీకట్లలో మరో అద్భుతం కూడా జరిగింది. చుట్టూ భవనాలు కూలిపోయి సర్వస్వం కోల్పోయామన్న బాధలో ఉన్న సమయంలో.. అదే శిథిలాల పక్కన వీధిలోనే ఒక కొత్త ప్రాణం పురుడు పోసుకుంది. డాక్టర్ & ఫెర్నాండా టెరాన్ అనే గర్భిణీ స్త్రీ, ఆ ఘోర విపత్తు మధ్యే రోడ్డుపై ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ కష్టసమయంలో అక్కడున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఆమెకు అండగా నిలిచి కాన్పు చేశారు. పుట్టిన వెంటనే ఆ పసికందును వెచ్చని దుప్పట్లలో చుట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.ప్రకృతి ఎంతటి విధ్వంసాన్ని మిగిల్చినా.. 'జీవితం' ఎప్పుడూ ఓడిపోదని, ఆశ ఎప్పటికీ చావదని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి.
Luego de 5 horas logramos rescatar a esta perrita que responde al nombre de Giselle, en Residencial El Palmar, Caraballeda.
— Nayib Bukele (@nayibbukele) June 30, 2026
Si alguien es su dueño, puede acercarse a nuestros equipos en la zona y demostrar con fotos o videos que es suya. pic.twitter.com/8ddID8Wtln
