రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు

 రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న  తొలి టెస్టు  మ్యాచ్లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌  టెస్టుల్లో ఆరుదైన ఘనత సాధించాడు. 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.  ఆసీస్ ఆటగాడు అలెక్స్‌ క్యారీని ఔట్‌ చేసి అశ్విన్‌ ఆ ఘనతను సాధించాడు. 450 వికెట్లు తీయడంతో అశ్విన్ పలు రికార్డులు సృష్టించాడు.  టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన మొదటి  భారత బౌలర్‌గా నిలిచాడు.  88 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే  93 టెస్టు మ్యాచ్ లో 450 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు. ఇక  ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్‌ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్‌లు) ఉన్నాడు. ఇక ఓ‍వరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.