తెలంగాణ తల్లికి అవమానం

తెలంగాణ తల్లికి అవమానం
  • తెలంగాణ తల్లిని రోడ్డుపక్కన పడేశారు

మంచిర్యాల జిల్లా: చెన్నూరులో తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్నాద్ చౌరస్తాలో విగ్రహాన్ని తొలగించి రోడ్డు ప్రక్కకు పడేశాడు కాంట్రాక్టర్. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు, ఎమ్మెల్యేకు తెలంగాణ తల్లిపై ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన బట్టి అర్థమవుతుందన్నారు. వెంటనే అధికారులు, నాయకులు స్పందించి విగ్రహాన్ని భద్రపరచాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమాన పరిచిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.