V6 News

దేశం ఎదగాలంటే  విద్య, మహిళా సాధికారతే కీలకం

దేశం ఎదగాలంటే  విద్య, మహిళా సాధికారతే కీలకం
  • ఓపెన్ వర్సిటీలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 
  • 375 మంది ఆదివాసీలకు, ఇద్దరు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లకు ప్రోత్సాహకాలు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ శక్తిగా భారత్ ఎదగాలంటే విద్య, మహిళా సాధికారత అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. సామాజిక సాధికార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సమతా స్కీమ్’ కింద ఉచిత విద్యకు ఎంపికైన 375 మంది ఆదివాసీ విద్యార్థులు, ఇద్దరు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ (జేఆర్ఎఫ్ఎఫ్​) ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను గవర్నర్ అందజేశారు.

దేశంలో విద్య, సామాజిక మార్పుకు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ వంటి మహనీయులు మార్గదర్శకులని గవర్నర్​కొనియాడారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని అందరి నాయకుడని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో  దూసుకెళ్తున్నారని, నారీ శక్తి వందన్ చట్టంతో చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ...  అంబేద్కర్ ఆదర్శాలతో సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఏ వర్సిటీలో లేని విధంగా ‘సమతా స్కీమ్’ ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల వారికి అండగా నిలుస్తున్నామని వివరించారు. జ్యోతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ.. తాను ఒకప్పుడు సామాన్య కూలీగా ఉన్నానని, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో చదవడంతోనే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వర్సిటీ రిజిస్ట్రార్ విజయ కృష్ణారెడ్డి, డైరెక్టర్ పుష్ప చక్రపాణి, ఓఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు. 

వర్సిటీల్లో ఏఐ ఆధారిత హైబ్రిడ్ విద్య అవసరం: విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా 

మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీల్లో ఏఐ ఆధారిత హైబ్రిడ్ విద్య ఎంతో అవసరమని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న సామాజిక సాధికారత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంలోని ఏఐ డీఈఏ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.0 వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం వర్సిటీ సొంత యూట్యూబ్ చానల్, రేడియో చానల్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్, బీఆర్ఏఓయూ డిజీ లైబ్రరీ, ఐ-బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రిలీజ్ చేసి మాట్లాడారు.

సామాజిక శాస్త్రాలలో నాణ్యమైన కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. వర్సిటీ తీసుకుంటున్న డిజిటల్ నిర్ణయాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్  నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామనివెల్లడించారు.