V6 News

వాళ్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.. నేను నోరు తెరిస్తే కాపురాలే కూలిపోతాయి: గీతా మాధురి షాకింగ్ కామెంట్స్

వాళ్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.. నేను నోరు తెరిస్తే కాపురాలే కూలిపోతాయి: గీతా మాధురి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు & పాప్ సింగర్ నోయెల్ సీన్ నిర్వహిస్తున్న ‘ఆఫ్ ది రికార్డ్’ టాక్ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన నటులు, గాయకులను ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత, వృత్తి విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్గా ఈ షోలో సింగర్ గీతా మాధురి పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూనే, కొన్ని ఆసక్తికర విషయాలను కూడా ప్రస్తావించారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే గీతా మాధురి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

గీతా మాధురి మాట్లాడుతూ.. “ఒక ఇద్దరు ప్రేమ జంట ఉన్నారనుకో.. వాళ్ళు నేను ఏ రోజు అయితే, కాఫీ షాపుకి వెళ్తానో... ఆ రోజే ఆ ప్రేమ జంట అక్కడికి వస్తారు. అలా నా కంటికి కనిపించి బుక్ అవుతుంటారు” అని చెప్పింది.

ఈ క్రమంలోనే ఎంత మంది దొరికిపోయారు గీతా అని నోయెల్ అడగ్గా.. ‘చాలా మంది దొరుకుతారు.. ఒకవేళ నేను నోరు తెరిస్తే కాపురాలే కూలిపోతాయి..’అని గీతా మాధురి సరదాగా షోలో పంచుకుంది. 

అయితే, ఇక్కడ ‘కాపురాలే కూలిపోతాయి’ అనే మాటలో అంతరార్ధం దాగుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు తమ అసలు భాగస్వాములు కాకుండా ఇతరులతో కనిపించిన సందర్భాలను తాను గమనించాననే భావన ఈ వ్యాఖ్యల్లో ఉందని భావిస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైన వెంటనే వైరల్ కావడంతో, ఇండస్ట్రీలోని వ్యక్తిగత సంబంధాలపై చర్చకు దారితీశాయి. గీతా మాధురి చెప్పిన వ్యక్తులు ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఆమె మరింత స్పష్టత ఇస్తారా? లేక పూర్తి ఎపిసోడ్ విడుదలైన తర్వాతే క్లారిటీ వస్తుందా అన్నది చూడాలి.

ఇకపోతే, గీతా మాధురి భర్త నందు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సైక్ సిద్ధార్థ’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.