DC vs PBKS: ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వర్షం కురుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య చారిత్రాత్మక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. కేవలం 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు రాబట్టి ఐపీఎల్ 2026 సీజన్‌లోనే అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేశారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో వరుసగా 4,4,4,4,4,4 ఫోర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు.
రికార్డుల సునామీ:
* ఐపీఎల్లో సెకండ్ హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్ సాధించిన పంజాబ్ కింగ్స్
* వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు చేసిన పంజాబ్
* SRH పేరిట హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్.. 2024లో ఢిల్లీపై 125 రన్స్ చేసిన SRH
* SRH తర్వాత ఈ రికార్డ్ పంజాబ్దే.. ఈ రెండు టీమ్స్ ఢిల్లీపైనే పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్ చేయడం విశేషం
ఢిల్లీ బౌలర్ల దారుణ వైఫల్యం:
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. దాదాపు ప్రతి బౌలర్ ఎకానమీ రేటు 20కి పైగా నమోదైంది. ముఖేష్ కుమార్ వేసిన 2 ఓవర్లలోనే 45 పరుగులు సమర్పించుకోగా, ఆకిబ్ నబీ సైతం జమ్మూ కాశ్మీర్ పేస్ సెన్సేషన్ ఆకిబ్ నబీ 2 ఓవర్లలో 41 పరుగులు ఇవ్వగా, టి. నటరాజన్ మాత్రమే తన ఓవర్లో 9 పరుగులు ఇచ్చి కొంతమేర పంజాబ్ బ్యాటర్లని కట్టడి చేయగలిగాడు. ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ కి చేరుకున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ విజయానికి 60 బంతుల్లో మరో 116 పరుగులు చేయాల్సి ఉంది.
A mountain to climb? They prefer to fly! 🦅
— IndianPremierLeague (@IPL) April 25, 2026
🎥 The Prabhyansh show is ON! 🔥
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/c45cbPOWiJ

