V6 News

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్..  రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ 

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్..  రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ 

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. గాయం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున యువ కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టును నడిపిస్తుండగా, సన్‌రైజర్స్ టీమ్‌లో దిల్షన్ మధుశంక స్థానంలో కమిన్స్, హర్ష్ దూబే స్థానంలో ప్రఫుల్ హింగే తుది జట్టులోకి వచ్చారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. ఎందుకంటే, పిచ్ చూడటానికి బాగుంది, మొదట ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నాం. గాయం తర్వాత నేను చాలా ఫ్రెష్‌గా ఉన్నాను, నా శరీరం బాగా సహకరిస్తోంది. గత 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను.. ఈ పిచ్ మా ఇద్దరికీ కొత్త సవాలు విసురుతుంది.. జట్టులోకి మధుశంక స్థానంలో నేను, హర్ష్ స్థానంలో హింగే వచ్చారని ప్యాట్ పేర్కొన్నారు. 

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం, కానీ మొదట బ్యాటింగ్ చేయడంలో మాకేం ఇబ్బంది లేదు.. గత రెండు సీజన్లలో మేము ఛేజింగ్‌లో అంతగా రాణించలేదు.. ఈ పిచ్ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది, ఇక్కడే మేము క్యాంప్ కూడా నిర్వహించాం.. మంచు ప్రభావం కొద్దిగా ఉండవచ్చు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాలని కోరుకుంటున్నాను పరాగ్ వెల్లడించాడు. 

ఇరు జట్లు: 
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ