V6 News

టోల్ ప్లాజా దగ్గర వెహికిల్స్ ఆగాల్సిన పనిలేదు.. త్వరలో కొత్తరకం టోలింగ్ సిస్టమ్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

టోల్ ప్లాజా దగ్గర వెహికిల్స్ ఆగాల్సిన పనిలేదు.. త్వరలో కొత్తరకం టోలింగ్ సిస్టమ్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. టోల్ ప్లాజా దగ్గర వాహనాలను ఆపకుండా టోల్ కలెక్ట్ చేసుకునే సిస్టమ్ త్వరలోనే ఇంప్లిమెంట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెహికిల్స్ ను ఆపి టోల్ వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలికి.. వాహనాన్ని ఆపకుండానే ఆటోమేటిక్ గా టోల్ కలెక్ట్ చేస్తారు. దీంతో వాహనదారులకు టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుందని తెలిపారు. 

 ఢిల్లీలో లాజిస్టిక్ శక్తి సమిట్ అవార్డ్స్ –2026 లో పాల్గొన్న ఆయన.. 2026 డిసెంబర్ నాటికి నేషనల్ హైవేలపై అంతరాయం లేని టోలింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఇది ఎలా పనిచేస్తుంది..?

ఏఐ ఎనలిటిక్స్ తో పనిచేసే వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు గడ్కరీ తెలిపారు. ఏఐ ఎనలిటికిస్ తో  ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), RFID ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (FASTag) వంటి సాంకేతికతలను ఉపయోగించి టోల్ కలెక్ట్ చేయనున్నారు. దీని ద్వారా వెహికిల్ ను ఆపకుండానే.. అడ్డంకులు లేని టోలింగ్‌ సౌకర్యం కల్పించవ్చునని ఆయన చెబుతున్నారు. 


హై పర్ఫామెన్స్ ఉండే ANPR కెమెరాలు, FASTag రీడర్‌ల ద్వారా వాహనాలను గుర్తించడం ఆధారంగా, టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండానే వాటికి ఛార్జీ విధిస్తారు. నిబంధనలను పాటించని వాహనదారులకు ఇ-నోటీసులు పంపించడం జరుగుతుంటుంది. ఈ నోటీసులకు రెస్పాండ్ కాకుంటే..  FASTag సస్పెన్షన్‌ చేయడంతో పాటు జరమినాలు విధించవచ్చు.

  • ఇండియాను శక్తివంతం చేయాలంటే..

భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే, రవాణా ఖర్చులను తప్పనిసరిగా తగ్గించుకోవాలని గడ్కరీ అన్నారు. ఐఐటి చెన్నై, ఐఐటి కాన్పూర్, ఐఐఎం బెంగళూరు సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్ల నిర్మాణం వల్ల దేశ రవాణా ఖర్చులు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయని ఆయన తెలిపారు.

అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చులు 12 శాతం, ఐరోపా దేశాల్లో 12 శాతం, చైనాలో 8-10 శాతం ఉన్నాయని  తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం తన 87 శాతం క్రూడ్ అవసరాలను తీర్చుకోవడానికి దిగుమతులపై ఆధారపడి ఉందని గడ్కరీ అన్నారు.

బయో ఫుయెల్ ఉత్తప్తి పెంచాలి:

మన ఇండియా రూ. 22 లక్షల కోట్ల విలువైన ఫాజిల్ ఫుయెల్ ( శిలాజ ఇంధనాలను) దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల కాలుష్యం కూడా ఏర్పడుతోంది. అందువల్ల, మనం ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని  ఆయన అన్నారు.

ఈ సందర్భంగా గ్రీన్ హైడ్రోజర్ ఫ్యూచర్ ఇంజన్ అని  అభివర్ణించారు గడ్కరీ. హైడ్రోజన్ ఇంధన కేంద్రాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికి వాటి నిర్వహణ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది తల లక్ష్యమని అన్నారు.