కత్తిపోట్లకు గురైన బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమెస్ మృతి

 కత్తిపోట్లకు గురైన బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమెస్ మృతి

లండన్: కత్తిపోట్లకు గురైన బ్రిటన్ ఎంపీ డేవిడ్ ఆమెస్ (69) చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారు. లీఆన్ సీ సమీపంలోని చర్చిలో  తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతుండగా సుమారు 25 ఏళ్ల వయసునున్న దుండగుడు కత్తితో దాడి చేసి పొడవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. కన్సర్వేటివ్‌ ఎంపీ డేవిడ్‌ అమెస్‌ 1952లో జన్మించారు. 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు. అమెస్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కత్తిపోట్లకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య ఎందుకు చేశాడన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. హత్య ఘటనతో ఎంపీల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశం అయింది.