శంషాబాద్ ORR దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు..స్పాట్ లోనే ఆరుగురు మృతి

శంషాబాద్ ORR దగ్గర  ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు..స్పాట్ లోనే ఆరుగురు మృతి

హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ (ORR) వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు .

పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఆగి ఉన్న ఓ లారీని.. వెనుక నుంచి వచ్చిన కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు తునకలైపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో.. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

మృతులంతా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతులు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.