నిర్మలా సీతారామన్ తో రాష్ట్ర బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్

V6 Velugu Posted on Jan 16, 2022

రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే బడ్జెట్ లో తెలంగాణ ప్రాముఖ్యతలను నేతల నుండి అడిగి తెలుసుకున్నారు నిర్మలా సీతారామన్. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, ఐఐఎం, NID, NISER విద్యా సంస్థలను కేటాయించాలని కోరారు  నేతలు. అంతేకాదు రైల్వే లైన్స్, జాతీయ రహదారుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. 2023 ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ లో తెలంగాణకు భారీగా నిధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు. నిర్మలా సీతారామన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెన్నం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి,  వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.

Tagged BJP Leaders, Nirmala Sitharaman, video conference

Latest Videos

Subscribe Now

More News