సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 266కు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా 239 పరుగుల ఆధిక్యం సాధించింది. సౌతాఫ్రికాకు 240 టార్గెట్ ను నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా స్కోరును పుజారా 53, రహానే 58తో స్కోరు బోర్డును నిలబెట్టారు. వీరితో పాటు హనుమవిహారి 40, శార్దుల్ ఠాకూర్ 28 పరుగులు చేయడంతో భారత్ 266 కు రెండో ఇన్నింగ్స్ ను ముగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 3, లుంగీ ఎంగిడీ 3, జాన్సన్ 3,ఒలివియర్ ఒక వికెట్ తీశారు. సౌతాఫ్రికా మొదటి ఇన్సింగ్స్ లో 229 కి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఇంకా 224 పరుగుల వెనుకంజలో ఉంది.
Innings Break!#TeamIndia all out for 266 (Pujara 53, Ajinkya 58) in the second innings. Set a target of 240 for South Africa.
— BCCI (@BCCI) January 5, 2022
Scorecard - https://t.co/qcQcovZ41s #SAvIND pic.twitter.com/Z2RGn6zTlC

