రాష్ట్రవ్యాప్తంగా టెట్ ఎగ్జామ్ మొదలైంది. తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభంకాగా నిమిషం లేటైనా అనుమతించమని తెలిపారు అధికారులు. ఎగ్జామ్ రాసేందుకు 6 లక్షల 29 వేల 352 మంది అప్లై చేసుకున్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తారు. పేపర్ వన్ ను 3 లక్షల 51 వేల 468 మంది రాస్తుండగా, పేపర్ టూ ను 2 లక్షల 77 వేల 884 మంది అభ్యర్థులు రాస్తున్నారు. 33 జిల్లాల్లో 2 వేల 683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల పేరు, తల్లి, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, పీహెచ్‌సీ తదితర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే.. ఎగ్జామ్ సెంటర్లో నామినల్‌రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుందని టెట్ కన్వీనర్ రాధారెడ్డి చెప్పారు.
పరీక్ష సమయం ముగిసే వరకు అంటే ఉదయం పరీక్షకు 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులను బయటకు పంపించే ప్రసక్తే లేదన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయం ముగిసే వరకు కూడా సెంటర్లలో వారికి కేటాయించిన సీట్లలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా అభ్యర్థులు మాల్‌ప్రాక్టీసింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నెగటీవ్ మార్కింగ్ లేదన్న విషయాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ముందుగా బాగా తెలిసిన ఆన్సర్ చేసి.. అనంతరం మిగతా అన్నింటికీ ఆన్సర్ చేయడం మంచిదన్నారు.
