- 14 రోజుల్లోనే 96వేల అప్లికేషన్లు..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా లక్షకు చేరువలో అప్లికేషన్లు వచ్చినట్టు టీజీ ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు మొత్తం 96,892 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. దీంట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 64,861 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 31,918 మంది అప్లై చేసుకున్నారు.
రెండు విభాగాలకు కలిపి 113 మంది దరఖాస్తు చేశారు. అప్లికేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ముందు అప్లై చేసుకున్న వారికి ముందే సెంటర్ల అలకేషన్ ఉండటంతో, అభ్యర్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.
