క్యాటరింగ్‌‌‌‌‌‌‌‌ వ్యాన్‌‌‌‌‌‌‌‌లో దాక్కుని ట్రంప్ ప్రయాణం !

క్యాటరింగ్‌‌‌‌‌‌‌‌ వ్యాన్‌‌‌‌‌‌‌‌లో దాక్కుని ట్రంప్ ప్రయాణం !

వాషింగ్టన్: ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే నుంచి అత్యంత గోప్యంగా తిరుగుపయనమయ్యారు. జులైలో తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా అమెరికా ఈ సీక్రెట్​ ఆపరేషన్​ నిర్వహించింది. నాటో సమిట్‌‌‌‌‌‌‌‌ కోసం ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుకగా ఇచ్చిన బోయింగ్‌‌‌‌‌‌‌‌ 7478లో అంకారా వెళ్లిన ట్రంప్.. తిరుగు ప్రయాణంలో కెమెరాల ముందు పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కారు.

లోపలికి ఎంటరైన ట్రంప్​ను ఆయన భద్రతాధికారులు రహస్య మార్గంలో నుంచి ఫుడ్ ట్రక్ (క్యాటరింగ్ వ్యాన్) లోకి చేర్చారు. ట్రంప్ను ఆ ట్రక్కులో దాచి సీక్రెట్​గా అమెరికా మిలటరీ విమానం ‘ఎయిర్ ఫోర్స్ సీ32ఏ’ లోకి ఎక్కించారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఆ విమానంలోనే ఉన్నారని శత్రువులను నమ్మించేందుకు, ఆయన భద్రత దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.