ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌‌‌‌ పై నిషేధం

ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌‌‌‌ పై నిషేధం
  • క్లాస్ ​లో ఇటాలియన్‌‌‌‌ లాంగ్వేజ్​రాని స్టూడెంట్స్​ 30 శాతానికి మించొద్దు 

రోమ్: స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌‌‌‌ పై ఇటలీ ప్రభుత్వం నిషేధం విధించింది. క్లాస్​లో ఇటాలియన్‌‌‌‌ భాష రాని స్టూడెంట్స్​30 శాతానికి మించొద్దని రూల్​ పెట్టింది. ఈమేరకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. అయితే 60 రోజుల్లోగా ఈ నిర్ణయం పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మెలోని సంకీర్ణ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉండటంతో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్​ను తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు వెయ్యి స్కూళ్లలోనే అమలు చేయనున్నారు. 

ప్రధానంగా ఇటీవల ఇటలీకి వచ్చిన, ఇటాలియన్ భాషపై ఎలాంటి పరిజ్ఞానం లేని విద్యార్థులు అధికంగా ఉన్న స్కూళ్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఒకే ప్రాంతంలోని స్కూళ్లలో విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే వారిని ఇతర పాఠశాలలకు పంపే అవకాశం ఉంటుంది. నిబంధనలను అమలు చేయడం సాధ్యంకాని పాఠశాలలకు మినహాయింపులు ఇస్తామని, అక్కడి స్టూడెంట్స్​కు ఇటాలియన్​ భాష నేర్పేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇటలీలోనే జన్మించిన విదేశీ విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.

రాజకీయ నిర్ణయమే.. 

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మెలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వలసలు, జాతీయ గుర్తింపు అంశాలపై కఠిన వైఖరిని కోరుతున్న వారిని సంతృప్తి పరిచేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నదని అంటున్నారు.