U19 World Cup 2024 Final: ఆఖరిలో తడబడిన ఆసీస్.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

U19 World Cup 2024 Final: ఆఖరిలో తడబడిన ఆసీస్.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

అండర్‌-19 ప్రపంచ కప్‌ 2024 ఫైనల్ లో ఆస్ట్రేలియా.. భారత్ ముందు ధీటైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. 254 పరుగుల భారీ టార్గెట్ ముందుంచింది. హర్జాస్ సింగ్(55; 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు) అర్ధశతకం బాదగా.. వీబ్‌జెన్(48), డిక్సన్(42), ఆలివర్ పీక్(41) పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. సామ్ కొంటాస్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రామ్ లింబానీ ఓ చక్కని బంతితో అతన్ని బౌల్డ్ చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన వీగెన్(48).. హ్యారీ డిక్సన్‌ (42)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఈ జోడీని నామన్ తివారీ విడగొట్టాడు. వరుస ఓవర్లలో ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు.

99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను హర్జాస్ సింగ్-ర్యాన్ హిక్స్ చక్కదిద్దారు. ఓవైపు నిలకడగా ఆడుతూనే.. మరోవైపు బౌండరీలు సాధించారు. అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. భారత బౌలర్లలో లింబానీ 3 వికెట్లు పడగొట్టగా.. నామన్ తివారీ 2, సామీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.