హైదరాబాద్, వెలుగు: వియత్నాంకు చెందిన ప్రైవేట్ విమానయాన సంస్థ వియత్ జెట్ భారతీయ కంపెనీలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, బర్డ్ గ్రూప్‌లతో కీలక ఒప్పందాలు చేసుకుంది. విమానయాన మౌలిక సదుపాయాలు, సేవలు, టెక్నాలజీ, రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పెంచడం ఈ ఒప్పందాల ఉద్దేశం. స్మార్ట్ విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, దీర్ఘకాలిక పెట్టుబడులపై ఇవి దృష్టి సారిస్తాయి.
బర్డ్ గ్రూప్‌కు గ్రౌండ్ హ్యాండ్లింగ్, శిక్షణ, టెక్నాలజీ రంగాల్లో సహకరిస్తాయి. వియత్నాం అధ్యక్షుడు లామ్ భారత్ పర్యటనలో భాగంగా ముంబైలో జరిగిన బిజినెస్ ఫోరమ్‌లో ఈ ఒప్పందాలు జరిగాయి.
