సస్పెన్స్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ 'హత్య'

సస్పెన్స్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ 'హత్య'

బిచ్చగాడు సినిమాతో పాపులరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య'.. బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ఈ సినిమాని లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న  ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ పాత్రలో నటిస్తుండగా,  రితికా సింగ్ కీలకపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను మేకర్స్  రిలీజ్ చేశారు.  మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి, సినిమా మీద క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. లీలను ఎవరు హత్య చేశారు అనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండటం ఈ వీడియోలో చూపించారు. విచారణ జరిపే సీటులో భాయ్ ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్, మేనేజర్, ఏజెంట్, పొరుగు మహిళ...వీరిలో ఎవరు. వీరెవరూ కాకుండా లీల హత్యకు మరెవరైనా కారణమా అనే ప్రశ్నలతో మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని వ్యక్తి (విజయ్ ఆంటోనీ)కి లీలను చంపాడా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి మిస్టరీ తేలనుంది.