వెంకట్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరుడు’. హెబ్బాపటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో విఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. డా.దిక్కల లక్ష్మణ్ రావు, డా.ప్రవీణ్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
సమ్మర్ స్పెషల్‌గా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. వెంకట్ గారికి ఇదొక మంచి కం బ్యాక్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.
