నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసింది మలయాళ బ్యూటీ హనీ రోజ్ (Honey Rose). తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌లో కూడా ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇటీవల హనీ రోజ్‌కు కేరళలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమెను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రారంభంలో పరిస్థితి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఆమె మాల్‌లోకి ప్రవేశించే సమయంలో అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ముందుకు దూసుకువచ్చారు.
ఈ క్రమంలో కొందరు వ్యక్తులు హద్దులు దాటి అనుచితంగా ప్రవర్తించారు. సెల్ఫీ తీసుకునే నెపంతో ఆమెకు మరింత దగ్గరగా వచ్చి లిమిట్స్ క్రాస్ చేశారు. ముఖ్యంగా ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ఆమె నడుముపై చేయి వేయడం కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంతో హనీ రోజ్ అసౌకర్యానికి గురై, వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.
►ALSO READ | వెంకట్ హీరోగా ‘హరుడు’.. మేలో రిలీజ్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, సెలబ్రిటీల పట్ల గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని, అభిమానం పేరుతో హద్దులు దాటకూడదని సూచిస్తున్నారు.
crowd touching her 🤯
— 000009 (@ui000009) March 29, 2026
Ela ra ala 😐
Event organizers em chesthunaru
Honey rose pic.twitter.com/SIi3CE5LT3
ఇంకొందరైతే.. అలా ఎలారా? ఇది అభిమానమా? అరాచకమా.. మీ సెల్ఫీల కోసం ఎక్కడైనా చేయ్యేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వాహకులు సైతం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
