హైదరాబాద్, వెలుగు: సీనియర్ నేషనల్ డెఫ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ భవాని కేడియా సత్తా చాటింది. విమెన్స్ సింగిల్స్ టెన్నిస్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. చండీగఢ్‌లో సోమవారం జరిగిన ఫైనల్లో భవాని 6–7, 6–10 తేడాతో ఏపీ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ చేతిలో సూపర్ టై బ్రేక్‌లో పోరాడి ఓడిపోయింది. గతంలో డెప్‌లింపిక్స్‌లో ఇండియాకు భవాని ప్రస్తుతం డేవిస్ కప్ మాజీ ప్లేయర్ ఎం. వాసుదేవ రెడ్డి వద్ద శిక్షణ పొందుతోంది.
