NCAహెడ్ ఆఫర్ ను తిరస్కరించిన లక్ష్మణ్

NCAహెడ్ ఆఫర్ ను తిరస్కరించిన లక్ష్మణ్

మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ కు BCCI బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఆ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లడం దాదాపు ఖరారైంది. ద్రావిడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో NCAహెడ్ గా లక్ష్మణ్ ను నియమించాలని బీసీసీఐ భావించింది.

ఇదే విషయాన్ని లక్ష్మణ్ తో చర్చించగా.. ఆ పదవిని చేపట్టేందుకు ఆయన ఇష్టపడలేదు. బెంగాల్ జట్టుకు కన్సల్టెంట్ గా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు మెంటార్ గా లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి లక్ష్మణ్ సరిపోతాడని బీసీసీఐ అనుకుంది.