థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు మళ్లీ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు. 
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయని, కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో కేవలం 79 మంది కరోనా ఇన్ పేషెంట్లు మాత్రమే ఉన్నారని మంత్రి గంగుల తెలిపారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో రోగుల కోసం ఇవాళ అత్యాధునిక సీటీ స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించామన్నారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు కరీంనగర్ జిల్లా ప్రసూతి ఆస్పత్రి వైద్యులు కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.