కేసీఆర్ జెలుకెళ్లే విషయంలో మా వ్యూహం మాకుంది

కేసీఆర్ జెలుకెళ్లే విషయంలో మా వ్యూహం మాకుంది

హైదరాబాద్ జల సౌధలో తెలంగాణ ENC సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.. ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి కృష్ణా బోర్డులు ఏర్పాటు చేసి నదీజలాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేసిందన్నారు. బోర్డుల సమావేశానికి ఇరు బోర్డుల అధికారులు హాజరయ్యారు..కానీ కేసీఆర్ డుమ్మా కొట్టారన్నారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరితే..ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు బండి సంజయ్. కృష్ణాలో తెలంగాణ కు 555 TMCలు  రావాల్సి ఉంటే కేవలం 299 TMCలకు కేసీఆర్ ఒప్పుకున్నాడన్నారు. కేసీఆర్, చంద్రబాబు,హరీశ్ రావు తో పాటు అప్పటి నీటి సలహాదారు విద్యాసాగర్ రావు నీటి వాటా ఒప్పందానికి ఒప్పుకున్నారని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు పై సుప్రీం కోర్టు లో కేసు ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ వేస్తామని జలశక్తి మంత్రి చెప్పారన్నారు. కేసీఆర్ తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి అని అన్నారు.
 
నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్ లో పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునే 19మంది మహిళలను కొట్టి హత్యాయత్నం కేసు పెట్టారని ఆరోపించారు. చిన్నారులు, బాలింతలను అరెస్ట్ చేశారు..మహిళల ఫొటోలను చూసి కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు..మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జైలుకి వెళ్ళాక కేసీఆర్ కుటుంబం కూడా ఇలానే ఏడుస్తారన్నారు బండి సంజయ్. అంతేకాదు.. కేసీఆర్ జెలుకెళ్లే విషయంలో మా వ్యూహం మాకు ఉందని జేపీ నడ్డా చెప్పారని అన్నారు.