తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు... ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు... ఎల్లో అలెర్ట్ జారీ

 తెలంగాణలో  రెండు రోజులు ( ఆగస్ట్ 3,4 తేదీలు) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం  ( ఆగస్టు 3 వ తేదీ నుంచి 4 వ తేదీ) ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 

 హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 23 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  పశ్చిమ దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అలాగే గురువారం నుంచి శుక్రవారం వరకు  ( ఆగస్టు 4,5 తేదీల్లో) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది.