రెండేళ్లలో 761 మావోయిస్టులు లొంగుబాటు: DGP శివధర్ రెడ్డి

రెండేళ్లలో 761 మావోయిస్టులు లొంగుబాటు:  DGP శివధర్ రెడ్డి

తెలంగాణలో గత రెండేళ్లలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి. గత 2 ఏళ్లలో  పోలీసుల ముందు 761 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా చెప్పారు. ఇందులో కేంద్ర కమిటీకి చెందిన నలుగురు కీలక నేతలు స‌రెండర్ అయినట్లు తెలిపారు.  శుక్రవారం (2026 ఏప్రిల్ 10) 42 మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా వివరాలను వెల్లడించారు.

అదేవిధంగా స్టేట్ కమిటీ – 21 మంది, డివిజనల్ కమిటీ – 40, ఏరియా కమిటీ – 149, పార్టీ సభ్యులు – 546 మంది లొంగిపోయినట్లు తెలిపారు. గత రెండేళ్లలో 302 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అందులో LMG – 5, AK-47 – 54 ఉన్నట్లు చెప్పారు.

►ALSO READ | బాలాపూర్ కోల్డ్ స్టోరేజీ నిండా కుళ్లిపోయిన మాంసం : హైదరాబాద్ సిటీలో మనం తింటున్నది ఇదేనా ఏంటీ..?

మావోయిస్టు అగ్రనేత గణపతి (ముప్పాల లక్ష్మణ్ రావు) గురించి క్లారిటీ ఇచ్చారు డీజీపీ. గణపతి బతికే ఉన్నాడని.. కానీ అడవుల్లో లేడని తెలిపారు. తెలంగాణకు చెందిన కేవలం 5 మంది మాత్రమే అజ్ఞాతం లో ఉన్నట్లు గుర్తించామన్నారు. 

  • అజ్ఞాతంలో ఉన్న కీలక నేతలు:

ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి)
పసునూరి నరహరి (సంతోష్)
జాడే రత్నబాయి (సుజాత)
వార్త శేఖర్ (మంగు)
రంగబోయిన భాగ్య (రూపి)