మామిడి పండును ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మామిడి పండ్లు తియ్యగా, రసంతో నిండి రుచిగా ఉంటుంది. అందుకే మామిడిని "పండ్ల రాజు" అని కూడా పిలుస్తారు. అయితే, ప్రపంచ మామిడి రాజధానిగా ఏ నగరం లేదా ఏ దేశం ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసా...?
ప్రపంచ మామిడి రాజధాని ఏది?
ప్రపంచ మామిడి రాజధానిగా మన భారతదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తి కేంద్రంగా ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు దగ్గరగా ఉన్న మాలిహాబాద్ అనే ప్రాంతాన్ని "మామిడి రాజధాని" అని పిలుస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2024-25 సంవత్సరంలో మన దేశంలో 228.37 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండింది. 2025 ఆగస్టులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లోక్‌సభలో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచం మొత్తం పండే మామిడి పండ్లలో 40 నుండి 45 శాతం వాటా ఒక్క భారతదేశానిదే. అందుకే మామిడి ఉత్పత్తిలో మన దేశానికి సాటి మరే దేశం లేదు.
మాలిహాబాద్‌ను మామిడి రాజధాని
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో సిటీకి దగ్గర్లో ఉండే ఒక చిన్న నగరమే ఈ మాలిహాబాద్. ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అతిపెద్ద మామిడి తోటల ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న 'దసరి' మామిడి పండ్లకు ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్. ఒక్క మాలిహాబాద్‌లోనే దాదాపు 300కు పైగా రకాల మామిడి పండ్లు పండుతాయి. ఇక్కడి ఎండాకాలం వాతావరణం, లోతైన సారవంతమైన మట్టి మామిడి తోటలకు బాగా కలిసి వస్తాయి. ఇక్కడి రైతులు తరతరాలుగా తమకున్న అనుభవంతో అద్భుతంగా మామిడి పంటలను పండిస్తున్నారు. దేశం మొత్తం పండే మామిడిలో ఉత్తర ప్రదేశ్ ఒక్కటే 25 శాతం కంటే ఎక్కువ వాటాతో ఉంది.
భారతదేశ మామిడి ఉత్పత్తి
మన దేశంలో మామిడి ఉత్పత్తికి సంబంధించిన లెక్కలు చూస్తే 2024-25లో భారతదేశం 228.37 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడిని సాధించింది. అంతర్జాతీయ నివేదికల (OECD-FAO) ప్రకారం, 2034 నాటికి భారత మామిడి ఉత్పత్తి 36 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోవచ్చు. అలాగే 2026 నాటికి భారత మామిడి మార్కెట్ విలువ 2.46 బిలియన్ డాలర్ల మేర నిరంతరం వృద్ధి చెందుతుందని అంచనా. ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర.. ఈ ఐదు రాష్ట్రాలే దేశంలోని 67 శాతం కంటే ఎక్కువ మామిడిని పండిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థ 'APEDA' ద్వారా మన మామిడి పండ్లను బ్రిటన్ (UK), జపాన్, రష్యా, అరబ్ దేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నారు.
ఫెమస్ మామిడి పండ్ల రకాలు
మన దేశంలో 500కు పైగా మామిడి రకాలు ఉన్న, ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన రకాలు చూస్తే ఉత్తర ప్రదేశ్ లో పండే దసరి రకంగా చాలా తియ్యగా ఉంటుంది, ఇందులో నార అస్సలు ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో పాండే బంగనపల్లి సైజు పెద్దదిగా ఉండి, పసిడి రంగులో చాలా రుచిగా ఉంటుంది. మహారాష్ట్రలో పాండే అల్ఫోన్సో ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన, ఖరీదైన మామిడి రకాల్లో ఒకటి. గుజరాత్ లో పాండే కేసర్ రకాన్ని "మామిడి పండ్ల రాణి" అని పిలుస్తారు. ఉత్తర ప్రదేశ్ & బీహార్ లో పాండే లంగ్రా పండ్ల రుచి పులుపు, తీపితో చాలా వెరైటీగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ లో పండే మరో రకం తొక్క చాలా పల్చగా ఉండి, ఎక్కువ తీపితో ఉంటుంది.
మామిడి పండ్ల గురించి ఫ్యాక్ట్స్
మామిడి పండు మన భారతదేశ జాతీయ ఫలం. మన దేశంలో దాదాపు 4వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండి మామిడిని పండిస్తున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే 7 లక్షల మందికి పైగా రైతులకు మామిడి తోటలే జీవనాధారం. మామిడి రైతులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్ అనే కార్యక్రమాన్ని నడుపుతోంది. మహారాష్ట్ర అల్ఫోన్సో అయినా, మాలిహాబాద్ దసరి అయినా, ఏపీ బంగనపల్లి అయినా.. భారతీయ మామిడి రుచే వేరు. అందుకే మన దేశాన్ని ప్రపంచ మామిడి రాజధాని అనడంలో ఎలాంటి డౌట్ లేదు!
