లండన్: భారతీయ అమెరికన్ సమీర్ బెనర్జీ (17) వింబుల్డన్ బాలుర ఫైనల్ లో తన ప్రత్యర్థిని రెండు వరుస సెట్లలో ఓడించి విజేతగా నిలిచాడు. ఆదివారం ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో వింబుల్డన్ 2021 బాలుర ఫైనల్ పోటీ జరిగింది. భారతీయ అమెరికన్ అయిన సమీర్ బెనర్జీ అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్ టైటిల్ కోసం తలపడ్డారు. ఇలాంటి ఒకే ఈవెంట్ లో ఇద్దరు అమెరికన్ బాలురు తలపడడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే 1977 తర్వాత ఇది రెండోసారి. 2014లో కూడా ఇద్దరు అమెరికన్ బాయ్స్ ఫైనల్ లో తలపడ్డారు. తాజాగా ఇప్పుడు 2021లో తలపడిన సమీర్ బెనర్జీ మరియు విక్టర్ లిలోవ్ ఇద్దరూ అన్ సీడెడ్ ఆటగాళ్లే కావడం గమనార్హం.

